తన కాలేజీ ప్రేమ గురించి చెప్పిన వర్మ – నేను ఆమెని ఎంతో ప్రేమించాను

Ramgopal Verma talks about his college love

0
98

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే ఆయన గురించి నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులని ఆయన ఇంటర్వ్యూలని జనం బాగా చూస్తారు. అయితే తాజాగా వర్మ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

చదువుకునే సమయంలో తాను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆమె పేరు సత్య అని తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో తాను ఆమె ప్రేమలో పడ్డానన్నారు. ఆ రోజుల్లోఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పక్కపక్కనే ఉండేవని అప్పుడు ఆమెని ప్రేమించాను అన్నారు. ఇలా తన ప్రేమ గురించి తెలిపారు వ‌ర్మ‌.

ఆమె మెడికల్ స్టూడెంట్, కానీ నాది వన్ సైడ్ లవ్ అని తెలిపారు వర్మ. డబ్బున్న వేరే కుర్రాడి కారణంగా తన ప్రేమని పట్టించుకోదు అని తాను భావించాను అని తెలిపారు వర్మ. నేను దర్శకుడు అయ్యాక రంగీలా సినిమాని అదే కథతో తీశాను అని తెలిపారు. సత్య మీద ఉన్న ప్రేమతోనే తాను తెరకెక్కించిన ఒక సినిమాకు సత్య అని పేరుపెట్టుకున్నా. క్షణక్షణం సినిమాలో శ్రీదేవి పాత్రకు సత్య అని పేరు పెట్టా అన్నారు.