ఎన్టీఆర్ సినిమాలో రమ్యకృష్ణకు పవర్ ఫుల్ పాత్ర….

ఎన్టీఆర్ సినిమాలో రమ్యకృష్ణకు పవర్ ఫుల్ పాత్ర....

0
107

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు… ఈచిత్రం పూర్తి అయిన తర్వాత తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నాడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది…

అన్ని కుదిరి ఉంటే ఈ పాటికే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ చివరిదశకు వచ్చేది… కానీ కరోనా కారణంగా ఇంకా ఆర్ ఆర్ ఆర్ చిత్రం పూర్తికాలేదు… తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మార్చినెలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ షూట్ లో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి…

అందుకే ఈ లోగా చిత్రంలో ఇతర నటీనటులు నటించే విషయమై చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించనుందని వార్తలు వస్తున్నాయి… ఈ చిత్రంలో రమ్యకృష్ణకు పవర్ ఫుల్ రోల్ ను ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది…