రమ్యకృష్ణ పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్

రమ్యకృష్ణ పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్

0
95

చాలా మంది హీరోయిన్లు బీజీగా మారిపోతున్నారు, ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు, అయితే కొందరు హీరోయిన్ ఛాన్స్ లు తీసుకుంటే మరికొందరు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. తల్లి చెల్లి అక్క అత్త అమ్మ ఇలా వారి పాత్రలలో నటిస్తున్నారు, ఇక వారిలో ముందుగా చెప్పాలి అంటే నటిగా రమ్యకృష్ణ పేరు వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో ఆమె చేసిన పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమెకు మంచి అవకాశాలు తెచ్చేలా చేశాయి. ఆమె ఒక్కో సినిమాకి రోజుకి 10 నుంచి 15 లక్షలు ఛార్జ్ చేస్తోందట. అయితే రొమాంటిక్ సినిమాకి 20 రోజులు కేటాయించినప్పటికీ ఆమె 50 లక్షలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్టు చెబుతున్నారు.

అయితే దీనికి కారణం కూడా ఉంది అని తెలుస్తోంది, ఏమిటి అంటే దర్శకుడు పూరి జగన్నాధ్ అలాగే కృష్ణవంశీ ఇద్దరూ మంచి మిత్రులు.. అందుకే వారి స్నేహం వల్ల అలాగే చార్మీతో ఫ్రెండ్ షిప్ వల్ల ఆమె తక్కువ పారితోషికం తీసుకున్నారు అని తెలుస్తోంది..ఫైటర్’ సినిమాలోనూ రమ్యకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్న సంగతి తెలిసిందే. మరో రెండు చిత్రాలు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నాయి వాటిలో కూడా ఆమె నటిస్తున్నారు