రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్న రమ్యకృష్ణ..!!

రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్న రమ్యకృష్ణ..!!

0
101

అలనాటి నటి రమ్యకృష్ణ టాలీవుడ్ లో మరో సినిమా చేయబోతుంది.. ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న `రొమాంటిక్‌` చిత్రం లో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తుంది.. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు.

అయితే రమ్యకృష్ణ ఇందులో రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనపడనున్నారు. మంగళవారం నుండి జరుగుతున్న షెడ్యూల్‌లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యారు. ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. నరేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.