ఇటీవల బయోపిక్ లు చాలా వస్తున్నాయి.. రాజకీయంగా ప్రముఖుల బయోపిక్స్ ఈ మూడు సంవత్సరాలలో వచ్చాయి.. యాత్ర, కథానాయకుడు, మహనాయకుడు, ఇలా తెలుగులో కూడా విడుదల అయ్యాయి. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారాంగా సినిమా తీస్తున్నారు… సినిమాకి ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ తలైవి,,,, ఇక టీజర్ ఇటీవల విడుదలైంది. మరో వైపు, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ మరో దర్శకుడు మురుగేశన్ తో కలిసి రూపొందిస్తున్న వెబ్ సిరీస్ క్వీన్… తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. సినిమాలా ఇది కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంది.
అయితే ఇక్కడ జయలలిత పాత్ర పోషించిన నటి ఎవరో తెలుసా రమ్యకృష్ణ. ఈ ట్రైలర్ లో రమ్యకృష్ణఆమె పాత్రలో అద్బుతంగా చేశారు అనేచెప్పాలి. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 14 నుంచి అన్ని ఎపిసోడ్స్ అందుబాటులో ఉంటాయి, ఆమె పాత్రకు రమ్యకృష్ణ న్యాయం చేశారు అంటున్నారు చిత్రయూనిట్.