రానా బర్త్ డే..విరాటపర్వం నుండి ‘వాయిస్ ఆఫ్ రవన్న’ పేరుతో స్పెషల్ వీడియో

Rana Birthday..Special video titled 'Voice of Ravanna' from Virataparvam

0
99

వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా చేస్తున్నాడు దగ్గుబాటి రానా. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. 1990లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఈ సినిమా ఉండనుంది. సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి విరాటపర్వంను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా రానా పుట్టిన రోజు సందర్భంగా విరాటపర్వం సినిమా నుంచి  రానా వాయిస్ తో ఓ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ది వాయిస్ ఆఫ్ రవన్నా అంటూ  ఇచ్చిన స్పెషల్ అప్డేట్ ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో రానా కామ్రేడ్ ‘రవన్న’గా కనిపించనున్నాడు. ఆయన భావావేశమే ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ పేరుతో వదిలారు.”మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే” అంటూ ఈ వీడియో మొదలవుతోంది. “చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూరుపు కొండని వెలిగిద్దాం” అంటూ ఉద్యమం దిశగా అడుగులు వేయించడానికి ఆయన చేసిన ప్రయత్నం కనిపిస్తోంది.

https://www.youtube.com/watch?v=hjnhxTT76R8&feature=emb_title