రానా అఫైర్ పై భార్య మిహికా క్లారిటీ….

రానా అఫైర్ పై భార్య మిహికా క్లారిటీ....

0
101

లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ కు చెందిన హీరోలు పెళ్లిపీటలు ఎక్కేసిన సంగతి తెలిసిందే… ఈ లిస్ట్ లో దగ్గుబాటి రానా కూడా ఉన్నాడు.. ఇంతకాలం మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న రానా గత ఆగస్టు నెలలో తన ప్రియురాలు మిహికా బజాజ్ ను వివాహం చేసుకున్నారు…

లాక్ డౌన్ సమయంలో తక్కుమంది కుటుంబ సమక్షంలో వివాహం చేసుకున్నాడు… తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించాడు… తనపై వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చాడు… గతంలో తనకు అఫైర్ ఉందని మీడియాలో వార్తలు వచ్చాని అన్నారు… వీటి గురించి తన భార్య మిహికాకు కూడా తెలుసని అన్నారు…

ఈ తరం యువతకు వాటి గురించి చాలా క్లారిటీ ఉందని అన్నారు… తనపై వచ్చిన గాసిప్స్ గురించి మిహికా ఎలాంటి ఆందోళన చెందలేదని అన్నారు… అంతేకాదు తన అఫైర్ గురించే కాదు తన ఆరోగ్యం గురించి కూడా గతంలో చాలా వార్తలు వచ్చాయని అన్నారు… అయితే వాటి గురించి మిహికా అస్సలు పట్టించుకోదని అన్నారు…