రానా పెళ్లాడబోతున్న మిహీక బజాజ్ బ్యాగ్రౌండ్ ఇదే

రానా పెళ్లాడబోతున్న మిహీక బజాజ్ బ్యాగ్రౌండ్ ఇదే

0
96

అగ్రనటుడు రానా దగ్గుబాటి త‌న ల‌వ్ గురించి తెలియ‌చేశాడు, ఇక త‌న‌ ప్రపోజల్ కు మిహీక బజాజ్ యస్ అని చెప్పిందంటూ రానా తెలియ‌చేశాడు, ఇక త‌నే స్వ‌యంగా త‌న ల‌వ్ గురించి చెప్పాడు, దీంతో ఇక లాక్ డౌన్ త‌ర్వాత పెళ్లి కూడా జ‌రుగ‌నుంది అని తెలుస్తోంది.

మిహీక బజాజ్ స్వస్థలం హైదరాబాదే అయితే ముంబయిలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తోంది.అంతేకాదు, డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్, డెకరేషన్ సంస్థ నడుపుతోంది. ఇక ఈ సంస్ధ సెల‌బ్రిటీ వివాహాల నిర్వ‌హ‌ణ చేస్తుంది, లండ‌న్ లో ఆర్ట్ అండ్ డిజైనింగ్ లో ఎంఏ చేసింది ఆమె.

ఇక మిహీక తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే క్రస్లా బ్రాండ్ పేరిట జ్యుయెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
తండ్రి పేరు సురేశ్ బజాజ్, తల్లిపేరు బంటీ బజాజ్. మిహీక తల్లి బంటీ జ్యుయెలరీ డిజైనర్ గా పేరు సంపాదించారు.మిహీకకు సమర్థ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. క్రస్లా బ్రాండ్ అంతా అత‌నే చేసుకుంటాడు, ఇక త్వ‌ర‌లో రానా ఆమెని వివాహం చేసుకోనున్నాడ‌ట‌.