అంగ‌రంగ‌వైభ‌వంగా రానా మిహీకా బజాజ్ వివాహం వారే స్పెష‌ల్ అట్రాక్ష‌న్

అంగ‌రంగ‌వైభ‌వంగా రానా మిహీకా బజాజ్ వివాహం వారే స్పెష‌ల్ అట్రాక్ష‌న్

0
136

మొత్తానికి టాలీవుడ్ హీరో భ‌ల్లాల‌దేవుడు ఓ ఇంటి వాడు అయ్యాడు, తన ప్రేయసి మిహీకా బజాజ్ తో నిన్న వివాహం జ‌రిగింది, అయితే భారీగా సినిమా న‌టులు సెల‌బ్రెటీలు రాక‌పోయినా త‌మ ఇరువురి కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ వివాహం జ‌రిపించారు, ఈ క‌రోనా కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

క‌రోనా వైర‌స్ త‌గ్గిన త‌ర్వాత గ్రాండ్ పార్టీ ఇవ్వ‌నున్నారు సురేష్ బాబు, అయితే హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది ఈ వివాహం, స్పెష‌ల్ డెక‌రేష‌న్స్ చేయించారు స్టూడియోలో,
అలాగే ఇరువురి కుటుంబ స‌భ్యుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు.

వెంక‌టేష్ దంప‌తులు, సురేష్ బాబు దంప‌తులు, వారి పిల్ల‌లు, రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌, నాగ‌చైత‌న్య స‌మంత స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు, వీరు అంద‌రూ రానా వివాహంలో సంద‌డి చేశారు.
పెళ్లికి రాని వారి కోసం వీఆర్ టెక్నాలజీ ద్వారా పెళ్లిని లైవ్ లో చూసిన అనుభూతి కల్పించారు.