రానా మిహీక పెళ్లి వేదిక ఫిక్స్

రానా మిహీక పెళ్లి వేదిక ఫిక్స్

0
91

టాలీవుడ్ హీరో, దగ్గుబాటి వారసుడు రానా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కుటుంబం నుంచి.. ఇక అంగరంగ వైభవంగా వివాహం జరుగనుంది, మిహికా బజాజ్- రానా పెళ్లి వేదిక తాజాగా ఖరారు అయింది అని వార్తలు వస్తున్నాయి.

రానా దగ్గుబాటి, మిహీక పెళ్లి హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో జరగనుందని తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన రాయల్ థీమ్ సెటప్, డెకరేషన్స్ను ఈవెంట్ మేనేజ్మెంట్ డిజైనర్ మిహీక స్వయంగా పర్యవేక్షించనున్నారు.

ఇక వివాహ తంతు మూడు రోజులు జరగనుంది అని తెలుస్తోంది, ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. ఇక ప్రభుత్వం చెప్పిన జారీ చేసిన నిబంధనల ప్రకారం తక్కువ మంది సభ్యులతోనే వివాహం జరుపనున్నారు..ఆగష్టు 8న ఈ ఇద్దరి పెళ్లి జరగబోతోంది. హైదరాబాద్లో లగ్జరీ హోటల్గా చెప్పుకునే తాజ్ ఫలక్నుమాలో ఈ ఇద్దరి పెళ్లి గ్రాండ్గా జరగబోతోంది.