రానా రవితేజ కొత్త సినిమా అప్ డేట్

రానా రవితేజ కొత్త సినిమా అప్ డేట్

0
111

రానా, రవితేజ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది, ఈ చిత్రం గురించి ఇప్ప‌టికే చాలా టాక్స్ వినిపించాయి, అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ వ‌చ్చింది…మలయాళంలో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన అయ్యప్పన్నుమ్‌ కోశియుమ్‌ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక ఈ వైర‌స్ లాక్ డౌన్ పూర్తి అయిన త‌ర్వాత వీరిద్ద‌రూ ఈ చిత్రం ప్రారంభించ‌నున్నారు, కుదిరితే అన్నీ సెట్ అయితే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వ‌స్తుంద‌ట‌. ద‌స‌రా స‌మ‌యంలో ఈ చిత్రం స్టార్ట్ చేసే అవ‌కాశం ఉంది అంటున్నారు.

ఈ లోపు రానా ర‌వితేజ‌కు చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అవుతాయి.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సుధీర్‌వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వ‌ర‌లోనే దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ట‌, అయితే రానా వివాహం త‌ర్వాత దీనిపై ప్ర‌క‌ట‌న వ‌స్తుంది అంటున్నారు.