మా మధ్య ఎలాంటి వివాదాలు ఉండవు: హీరో రానా

-

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ సినిమా అవార్డుల వివాదంపై హీరో రానా దగ్గుబాటి(Rana) స్పందించాడు. సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో జానర్‌ సినిమా నచ్చుతుందని తెలిపాడు. నటుల అభిరుచులు కూడా అలానే ఉంటాయన్నాడు. సూర్య నటించిన ‘జైభీమ్‌’ సినిమా కథకు జాతీయ అవార్డు వస్తుందని చాలా మంది అనుకున్నారని.. కానీ ఆ సినిమాకు అవార్డు రాలేదన్నాడు. దీంతో చాలా మంది నిరుత్సాహపడ్డారని దానిపై ఎవరి అభిప్రాయం వారు తెలిపారని స్పష్టం చేశాడు. అంతే కానీ కాంట్రవర్సీ చేయాలని కాదని.. వాళ్లు కేవలం ట్వీట్‌ మాత్రమే చేశారని పేర్కొన్నాడు. మా ఆర్టిస్టుల మధ్య ఎలాంటి వివాదాలు ఉండవని వెల్లడించాడు.

- Advertisement -

‘జైభీమ్‌’ సినిమాకు ఒక్క నేషనల్ అవార్డు కూడా రాకపోవడంపై చాలా మంది నటులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకూ దీనిపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. తెలుగు స్టార్ హీరో నాని(Nani) కూడా ‘జైభీమ్‌’కు జాతీయ అవార్డు రాకపోవడంతో తన హృదయం ముక్కలైందని తెలిపాడు. అలాగే తమిళ సినీ ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. తాజాగా ఈ వ్యాఖ్యల వివాదంపై రానా(Rana) క్లారిటీ ఇచ్చాడు.

సైమా సంబరాలు త్వరలోనే మొదలు కానున్నాయి. ఈనెల 15, 16 తేదీల్లో దుబాయ్‌ వేదికగా సైమా అవార్డుల వేడుక అట్టహాసంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ ఏర్పాటుచేశారు. ఇందులో రానా, హీరోయిన్లు నిధి అగర్వాల్‌, మీనాక్షి చౌదరి, సైమా ఛైర్‌ పర్సన్‌ బృందా ప్రసాద్‌, శశాంక్‌ శ్రీ వాస్తవ్‌ పాల్గొన్నారు.

Read Also: సిక్స్ కొడితే రూ.లక్ష.. ఫోర్ కొడితే రూ.25వేలు.. బంపర్‌ ఆఫర్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...