రానా తో వెంకటేష్ మల్టి స్టారర్ మూవీ..!!

రానా తో వెంకటేష్ మల్టి స్టారర్ మూవీ..!!

0
92

F2 , వెంకీ మామ వంటి మల్టి స్టారర్ చిత్రాలతో ఈ సంవత్సరం మంచి దూకుడు మీదున్న వెంకటేష్ ప్రస్తుతం మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తమిళంలో సూపర్ హిట్ సాధించిన అసురన్ సినిమాను వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

దీనిని సురేష్ ప్రొడక్షన్స్, వి ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, అసురన్ సినిమాలో ధనుష్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి యంగ్ పాత్ర కాగా, రెండోది మిడిల్ ఏజ్ పాత్ర. అయితే, ఇందులో మధ్యవయస్కుడి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారట.

యంగ్ ఏజ్ పాత్రలో అబ్బాయి రానా నటించే అవకాశం ఉందని అంటున్నారు. వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు వరసగా చేస్తున్న సంగతి తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్ 2, వెంకిమామ సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. అసురన్ సినిమా కూడా మల్టీస్టారర్ గా రాబోతున్నది.