పవరుంటే సరిపోదు.. అది ఎవరి మీద చూపించాలో కూడా తెలుసుకోవాలి

'పవరుంటే సరిపోదు.. అది ఎవరి మీద చూపించాలో కూడా తెలుసుకోవాలి'..

0
89

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్స్‌గా, సుధీర్ వర్మ దర్శకత్వంలో, PDV ప్రసాద్ సమర్పణలో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా.. ‘రణరంగం’.. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌ అండ్ లిరికల్ సాంగ్స్‌కి, ‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్’ వీడియో సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా రణరంగం థియేట్రికల్ ట్రైలర్ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదలైంది.

శర్వా, కళ్యాణి ప్రియదర్శన్‌ని చూసి, ఆమెని ఫాలో అవుతూ.. ‘ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టాడంటే డబ్బులెక్కువై అనుకున్నాను.. కొంతమంది కోసం కట్టొచ్చు, ఖర్చు పెట్టొచ్చు’.. అనే డైలాగ్ చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘ఈ విశాఖ పట్నంలో ఎవరు మందు కావాలన్నా మన దగ్గరే కొనాలి’ అనే డైలాగ్‌తో హీరో లిక్కర్ మాఫియా రన్ చేసే వ్యక్తి అని చూపించారు. ‘పవరుంటే సరిపోదు.. అది ఎవరి మీద చూపించాలో కూడా తెలుసుకోవాలి’.. వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఆర్ఆర్, ఫోటోగ్రఫీ కూడా బాగున్నాయి.

రణరంగంలో శర్వానంద్ మామూలు వీధి రౌడీ స్థాయి నుండి, డాన్‌గా ఎదిగే రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు. రాజా రవీంద్ర, మురళీ శర్మ, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సంగీతం : ప్రశాంత్ పిళ్లై, కెమెరా : దివాకర్ మణి, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అర్జున్ – కార్తీక్, ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్, స్టంట్స్ : వెంకట్.