మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా రానా భార్య!

Rana's wife as heroine in Mahesh Babu movie!

0
116

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే సర్కారు వారి పాట మూవీని దాదాపు కంప్లీట్ చేసిన సూపర్ స్టార్ తరువాతి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఏప్రిల్లో షూటింగ్ మొదలు పెట్టి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు త్రివిక్రమ్ టీం ప్లాన్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె చెల్లెలు పాత్రకు మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో… సంయుక్త రానా భార్యగా నటించింది. ఆమె టాలెంట్ కు ఫిదా అయిన త్రివిక్రమ్… మహేష్ బాబు మూవీలో ఆమెకు కీలక ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు ఇప్పటికే దీనిపై చర్చలు జరిగాయని ఈ ఆఫర్ ను సంయుక్త కూడా యాక్సెప్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు, పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మహేష్ బాబు కరోనా బారిన పడడం అలాగే.. ఆయన అన్నయ్య మరణించడంతో ఈ ప్రాజెక్టు పూర్తవడానికి చాలా లేట్ అయింది.