‘Unstoppable with NBK‘ మూడవ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీల సందడి చేశారు. తాజాగా మరో ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్నా(Rashmika Mandanna), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ షోలో సందడి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా సంస్థ విడుదల చేసింది. నవంబర్ 24న ఈ వైల్డ్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది.
Unstoppable with NBK | గ్యాంగ్‌స్టార్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేశ్ ఒబెరాయ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.