Ranbir Kapoor |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసిన చిత్రం ఆదిపురుష్(Adipurush). ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేశారు. రామాయణ కథ కావడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సకల శుగణాభిరాముడు కథని చూడలేని వారికి చూపించాలని కొంతమంది సెలబ్రిటీస్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) 10 వేల ఆదిపురుష్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. నార్త్‌లోని పలు ప్రాంతాల్లోని పేద పిల్లలకు ఈ టికెట్స్‌ని డొనేట్ చేయబోతున్నాడు. రాముడి కథ ఈతరం వాళ్ళకి కూడా తెలియాలని రణ్‌బీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.