రంగమ్మత్తకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్…

రంగమ్మత్తకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్...

0
85

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు… తన హావ భావాలతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బుల్లితెర భామ… ఇక్కడ క్రేజ్ వచ్చిన తర్వాత వెండితెరలో కూడా ఎంట్రీ ఇచ్చి కొన్ని కీలక పాత్రలను పోషించింది…

క్షణం, రంగస్థలం సినిమాలు ఈ ముద్దుగుమ్మకు మంచిపేరు తీసుకువచ్చాయి… రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించి రంగమ్మత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది… అయితే ఇప్పటివరకు కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిన అనసూయ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

అదికూడా సినిమాలో కాదట.. సీరియల్ లో అట.. హిందీ టాప్ రెటెడ్ సీరియల్ లో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించారట.. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే అనసూయ స్పందించేవరకు ఆగాల్సిందే…