‘రంగమార్తాండ’ కోసం రంగంలోకి చిరు..ఎందుకో తెలుసా?

0
125

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రంగమార్తాండ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మెగా సర్​ప్రైజ్ ఇచ్చారు కృష్ణవంశీ. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారని వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.  ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది.

అడగ్గానే ఒప్పుకుని, మరేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తమ చిత్రంలో వాయిస్ ఓవర్ చెప్పినందుకు థాంక్యూ అన్నయ్యా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. మెగా వాయిస్ ‘రంగమార్తాండ’ వినీలాకాశంలో మరో వెలుగు దివ్వె అని అభివర్ణించారు.

‘రంగమార్తాండ’ చిత్రంలో ప్రకాశ్ రాజ్ తో పాటు రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.నాటకాన్ని ప్రాణంగా భావించి.. దాన్నే ఆధారంగా చేసుకుని జీవించే కళాకారులు, వారి కష్టాలను తెలియజేసేలా ఈ సినిమా సిద్ధమవుతోంది.