రంగంలోకి శ్రీనువైట్ల కొత్త సినిమా షురూ

రంగంలోకి శ్రీనువైట్ల కొత్త సినిమా షురూ

0
88

కామెడీ కమర్షియల్ యాక్షన్ ఇలా ఏ చిత్రం చేయాలి అన్నా దర్శకుడు శ్రీనువైట్ల పేరు వినిపించేది.. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సూపర్ హిట్ సినిమాలు అందించారు శ్రీను వైట్ల.. కాని కొద్ది నెలలుగా శ్రీను వైట్ల సినిమాల అనౌన్స్ మెంట్ లేదు. అసలు సినిమా కధలు వినిపిస్తున్నారు అనే మాట వినిపించడం లేదు.

దీనికి కారణం కూడా ఉంది ఆయన చివరగా చేసిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి . ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసగా ఫ్లాప్‌లు పలకరించడంతో గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో ఓ మంచి కథను సిద్ధం చేశాడట. తాజాగా ఆ విషయాలను శ్రీనువైట్ల వెల్లడించాడు.

అవును మళ్లీ మనకు పాత శ్రీను వైట్ల కనిపించనున్నారు అని తెలుస్తోంది.. తాజాగా ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తున్నారు అందుకే శ్రీను వైట్ల కూడా ఎవరికి కనిపించకుండా మంచి కథ కోసం ప్లాన్ చేసుకున్నారట, అందుకే ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నారట..చివరకు కథ రాసుకోవడం అయింది … హీరోకి స్టోరీ వినిపించి సినిమా అనౌన్స్ చేస్తారట. తాజాగా ఆవిషయం ఆయనే తెలియచేశారు.