రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర రాశి ఎందుకు వదులుకున్నారంటే

అందుకే ఆమె ఈ పాత్ర వద్దు అనుకున్నారు

0
89

తెలుగులో అందాల తార రాశి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందరు అగ్ర హీరోల సరసన ఆమె నటించారు. ఇటు తెలుగు, తమిళ్ లో ఆమెకి అనేక అవకాశాలు వచ్చాయి. ఇక స్టార్ హీరోయిన్ గా ఆమె వెలుగొందారు. కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు రాశి. ఇక తెలుగులో ఆమెకి గోకులంలో సీత, పెళ్లిపందిరి, ప్రేయసిరావే ఈ చిత్రాలు చాలా పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

సావిత్రి, సౌందర్య తర్వాత కుటుంబ కథా చిత్రాలకు, హోమ్లీ పాత్రలకు అంత పేరు సంపాదించుకుంది రాశి. అయితే ఆమెకు రంగస్థలం సినిమాలో ముందు అవకాశం వచ్చిందట. రంగమ్మత్త పాత్ర చేయమని ముందు రాశిని చిత్ర యూనిట్ సంప్రదించారట. అయితే ఆమె ఈ పాత్ర చేయనని చెప్పారట దానికి కారణం కూడా ఉంది.

ఈ సినిమాలో 1980 నాటి పల్లెవాతావరణంలో మహిళగా, మోకాళ్ల దాకా చీరకట్టుకుని పాత్ర చేయాలి అని చెప్పారు. అందుకే ఆమె ఈ పాత్ర వద్దు అనుకున్నారు. ఈ పాత్ర యాంకర్ అనసూయ చేశారు. అయితే రాశి అభిమానులు మాత్రం ఆమెని సినిమాల్లో నటించాలి అని కోరుతున్నారు