కేజీఎఫ్ – 2 లో రావురమేష్ క్యారెక్టర్ అదిరింది

కేజీఎఫ్ - 2 లో రావురమేష్ క్యారెక్టర్ అదిరింది

0
96

కేజీఎఫ్…. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ అన్నీ భాషల్లో హిట్ అయింది…..బాహుబలి తర్వాత దక్షిణాది నుంచి తెరకెక్కిన భారీ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడుగా తెరకెక్కించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. అంతేకాదు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు ..ఆల్రెడీ చిత్రీకరణ పూర్తి అవుతోంది. దీంతో దీనిపై దర్శకుడు చాలా ఫోకస్ పెట్టారు.

అయితే అన్నీ భాషల్లో ఇది నచ్చడంతో పలు భాషల్లో సీనియర్ నటులని పార్ట్ 2లో తీసుకుంటున్నారు, బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్దత్ ఈ రెండో భాగంలో విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూడా మెరవబోతోంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు రావు రమేష్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తాజాగా ప్రశాంత్ నీల్ తెలియజేశాడు.

దీంతో ఇక ఈ సినిమా కచ్చితంగా పార్ట్ 1 కంటే అద్బుతంగా ఉంటుంది అంటున్నారు.తాజాగా దర్శకుడు ఆయనకు స్వాగతం పలికారు.. మరి ఎలాగో చూద్దాం…కేజీఎఫ్-2కు స్వాగతం రావు రమేష్ సర్. సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకుల ఊహలకే వదిలేస్తున్నాం. కేజీఎఫ్-2`లో భాగమైనందుకు ధన్యవాదాలు సర్ అంటూ చెప్పాడు వీరిద్దరు దిగిన ఫోటో కూడా ట్వీట్ లో యాడ్ చేశారు.