తెలుగు చలనచిత్ర సీమలో విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న అతికొద్ది మందిలో రావూ రమేష్(Rao Ramesh) పేరు తప్పకుండా ఉంటుంది. ఆయన తన తాజాగా సినిమా విడుదల సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన శైలి నటనకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం(Maruthi Nagar Subramanyam)’ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన రామానాయుడు స్టూడియోలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. అనంతరం ఆయన దర్శకుడు లక్ష్మణ్‌ను కలిశారు. అప్పుడే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా చాలా బాగా తీశావంటూ లక్ష్మణ్‌ను అభినందించారు. చాలా సంతోషంగా ఉందంటూ రావూ రమేష్ భావోద్వేగానికి గురికావడంతో దర్శకుడు లక్ష్మణ్ కూడా ఒంకింత భావోద్వేగానికి గురయ్యారు. టీమ్ మొత్తం ఒకరినొకరు అభినందించుకున్నారు.
అయితే ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ఓ మధ్యవస్కుడి నిరుద్యోగ కష్టాలు చుట్టూ సాగే కథ. ఈ సినిమాలో మధ్యవయస్కుడైన నిరుద్యోగి పాత్రలో రావూ రమేష్ అద్భుతంగా నటించారు. విడుదలైన తొలి రోజు నుంచి ప్రతి సెంటర్‌లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతుంది ఈ సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపు తమకు సుబ్రహ్మణ్యమే కనిపించాడని, పాత్రలో రావూ రమేష్(Rao Ramesh) అంతలా ఒదిగిపోయారంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కూడా చాలా సాఫీగా సాగిందని ఆనంద వ్యక్తం చేశారు.