హీరోయిన్స్ లో తను నా బెస్ట్ ఫ్రెండ్– రాశీఖన్నా

హీరోయిన్స్ లో తను నా బెస్ట్ ఫ్రెండ్-- రాశీఖన్నా

0
95

సినిమా అవకాశాలు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తాయో అంత సులువుగా చెప్పలేము, ఒక్క హిట్ బొమ్మ పడితే చాలు స్టార్ హీరో అవుదాము అనుకునేవారు చాలా మంది ఉంటారు. అయితే హీరోయిన్లకు కూడా అవకాశాలు ఈ మధ్య వస్తున్నా, కొన్ని సినిమాలు చేసి ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న తారలే చాలా మంది ఉంటున్నారు, అందుకే వచ్చిన ప్రతీ అవకాశాన్ని వదులుకోకుండా చేసుకుంటున్నారు.

ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది రాశీ ఖన్నా.. తర్వాత కొన్ని సినిమాల్లో నటించి అందరికి ఆకట్టుకుంది, అయితే గ్లామర్ గా రాశీకి పోటీ లేదు అనే చెప్పాలి అలాగే నటనలో సూపర్ మార్క్స్ కొట్టేసింది. ఇక తాజాగా రాశీ ఖన్నా నటించిన పత్రిరోజూ పండగే , అలాగే వెంకీ మామ సినిమాలు వారం రోజుల గ్యాప్లో విడుదల కాబోతున్నాయి.

ఇక వెంకీమామ సినిమాలో రాశీ చైతూకి జోడిగా నటించింది, అయితే ఈ సినిమాలో ముందు తనకు కాకుండా ఆ పాత్ర రకుల్ అని అనుకున్నారట.. తర్వాత రాశీని తీసుకున్నారు అని చెబుతోంది, ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆమెకు డేట్స్ కుదరలేదు అందుకే తాను ఈ సినిమా చేశాను అని చెప్పింది.. చైతూతో సినిమా చేయడం బాగా నచ్చిందని, వెంకటేష్ గారి లాంటి సీనియర్ తో నటించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది ఈ అందాల తార.