అలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంటా – అందాల తార రాశీఖన్నా

Rashi Khanna funny comments on her marriage

0
91

అందాల తార రాశీ ఖన్నాకు చిత్ర సీమలో లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిందీలో తెరకెక్కిన మద్రాస్ కేఫ్ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో ఎంతో మంచి పేరు గుర్తింపు సంపాదించుకుంది. కుర్రాళ్ల హృదయాల్లో నిలిచిపోయింది. ఇక తెలుగులో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది.
తెలుగు తమిళం, మలయాళం, సినిమాల్లో నటిస్తూ మరో పక్క వెబ్ సిరీస్లలోనూ నటిస్తోంది.

ఇక చాలా మంది హీరోయిన్లు ఈ మధ్య వివాహం చేసుకుంటున్నారు. మరి రాశీఖన్నా పెళ్లి ఎప్పుడు అని చాలా మంది నెటిజన్లు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆమె ఫ్యాన్స్ కూడా ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ప్రశ్న ఎదురైతే క్లారిటీ ఇవ్వలేదు కాని తనకు ఎలాంటి వ్యక్తి కావాలో చెప్పింది.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తాను వివాహం చేసుకునే వ్యక్తి అందగాడు కాకపోయినప్పటికీ. ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని చెప్పుకొచ్చింది. నేను ఎంతలా దేవుడిపై నమ్మకం కలిగి ఉన్నానో, తను అలా ఉండాలి అని అలాంటి భర్త తనకు రావాలి అని చెప్పింది.