జగన్ పై రాశిఖన్నా ప్రశంసలు మీరు వినండి

జగన్ పై రాశిఖన్నా ప్రశంసలు మీరు వినండి

0
96

అమ్మాయిలపై దారుణాలకు తెగబడే వారిని చంపేయ్యాలని మహిళా లోకం నినదిస్తోంది, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల జరిగిన విషాదకరమైన ఘటన దిష సంఘటనతో మహిళలు ఇలాంటి పోరంబోకులని పోకిరీలను వదలకూడదు అని చెబుతున్నారు. సినిమా తారలు కూడా ఇలాంటి వారిని హ్యాంగ్ చెయ్యాలని జైలులో పెట్టకూడదు అని కోరుకుంటున్నారు.

తాజాగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు దిష చట్టాన్ని తీసుకువచ్చింది…మహిళల పై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ దిశ చట్టం రూపొందించింది. శుక్రవారం ఎపి శాసనసభ దిశ యాక్ట్ 2019కి ఆమోద ముద్ర వేసింది. దీనికి టాలీవుడ్ మెగా స్టార్ హీరో చిరంజీవి కూడా కితాబిచ్చారు. తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఈ అంశం పై స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిందని, ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాం అనే భయం.. తప్పు చెయ్యాలనుకునే వారిలో వస్తోందని… ఈ చట్టాన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని రాశి ఖన్నా కామెంట్స్ చేసింది. దీంతో రాశీ కామెంట్లకు అందరూ ఎస్ అని సపోర్ట్ చేస్తున్నారు.