హాట్ టాపిక్ గా రష్మిక రెమ్యునరేషన్..’పుష్ప-2′ కోసం అన్ని కోట్లా?

Rashmi Remuneration as a Hot Topic .. All Quotes for 'Pushpa-2'?

0
102

అల్లు అర్జున్ తో కలిసి నటించాలన్న తన కల ‘పుష్ప’ సినిమాతో నెరవేరడం ఎంతో ఆనందంగా ఉందని హీరోయిన్ రష్మిక మురిసిపోయింది. ఈ చిత్రంలో డీ గ్రామరైజ్డ్ గా శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక.. షూటింగ్​కు వెళ్లకముందే చిత్తూరు యాస నెర్చుకొని సెట్​లో అడుగుపెట్టినట్లు వెల్లడించింది.

పుష్ప’లో అల్లు అర్జున్​ తన నటవిశ్వరూపం చూపిస్తే, పల్లెటూరి అమ్మాయిగా రష్మిక ఆకట్టుకునేలా కనిపించింది. ‘ఈ సందర్భంగా ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. అయితే రెండో పార్ట్​ కోసం రష్మిక రెమ్యునరేషన్​ పెంచేసిందని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హాట్​ టాపిక్​గా మారింది.

‘పుష్ప’ కోసం రష్మిక రూ.2 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రెండో భాగం కోసం 50 శాతం పెంచేసింది! అంటే మొత్తం రూ.3 కోట్లు డిమాండ్ చేసిందట. దానికి నిర్మాతలు కూడా ఒప్పుకొన్నారట. రష్మిక సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్ను’ అనే చిత్రంలో, అమితాబ్‌ బచ్చన్‌తో ‘గుడ్‌ బై’ అనే సినిమాలో నటిస్తుంది.