నితిన్ పెళ్లి పై సంచలన కామెంట్ చేసిన రష్మిక

నితిన్ పెళ్లి పై సంచలన కామెంట్ చేసిన రష్మిక

0
90

టాలీవుడ్ హీరో నితిన్ కు, తన ప్రేయసి శాలినితో ఈ రోజు నిశ్చితార్దం జరిగింది.. దీనికి సంబంధించిన పిక్స్ కూడా నితిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.. మ్యూజిక్ స్టార్ట్స్ అంటూ తన పెళ్లి గురించి తెలిపారు.. ఆయన కుటుంబ సభ్యులు, ఆమె కుటుంబ సభ్యులు, కొందరు సినిమా ఫ్రెండ్స్ తో మాత్రమే ఈ వేడుక ఘనంగా నిర్వహించారు.

ఇక త్వరలో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు, అలాగే హైదరాబాద్ లో గ్రాండ్ గా పెళ్లి అయిన తర్వాత ఫంక్షన్ అలాగే స్నేహితులకి పార్టీ కూడా ఇవ్వనున్నారు ఆయన… తాజాగా ఆయనతో కలిసి బీష్మలో నటించిన టాలీవుడ్ స్లిమ్ బ్యూటీ రష్మిక మందన్న నితిన్ పెళ్లి గురించి స్పందించింది.

కంగ్రాచ్యులేషన్స్ నితిన్ సార్ చూడండి నేను మీకు ఎంత అదృష్టం తీసుకువచ్చానో…మీరు నాతో నటిస్తున్నారో లేదో ఓ ఇంటివారు కాబోతున్నారు. మీ ఇద్దరూ పెళ్లితో ఒక్కటవుతుండడం పట్ల ఎంత సంతోషంగా ఉన్నానో అంటూ రష్మిక ట్వీట్ చేసింది. దీంతో నితిన్ అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.