రష్మిక తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది, అగ్రహీరోల సినిమాలు అంటే ఆమె పేరు వినిపిస్తోంది, ఆమెకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయింది, అర్దమవుతోందా అంటూ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె హావభావాలు అందరిని మరింత ఆకట్టుకున్నాయి, చూపుతిప్పుకోలేని అందం అని అంటున్నారు అభిమానులు.
రష్మిక, అసలు ఇంత అందంగా ఎలా ఉంటోంది.. ఆమె రోజూ ఏం తింటోంది..అని తెలుసుకుంటే, ఉదయం లేవగానే ముందు ఫుల్ గా నీరు తాగుతుందట, ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చాలా లిమిట్ గా తీసుకుంటుంది. అవకోడా టోస్ట్ తింటుంది. అయితే రీసెంట్ గా అపాయింట్ చేసుకున్న డైటీషియన్ మాత్రం ఆమెను ఎక్కువ నీరు తాగనివ్వడం లేదట.
దాని బదులు యాపిల్ జ్యూస్ ఇస్తోందట. ఇక అల్పాహారంలో కూడా అవకోడా టోస్ట్ తగ్గించేస్తోందట. ఇక మధ్యాహ్నం ఆమె లంచ్ చూస్తే సౌత్ ఇండియా ఫుడ్ తీసుకుంటుంది, అన్నం తక్కువగా కూరలు ఎక్కువగా తీసుకుంటుందట, డిన్నర్ చాలా లైట్ గా తీసుకుంటుంది, ఫ్రెండ్స్ తో డిన్నర్ కు ఎక్కువగా బయటకు వెళుతుందట.. ఆమెకు కీర, టమాట, కాప్సికమ్ అంటే అస్సలు ఇష్టముండదట.. ప్రతి రోజూఆహారంగా రెండు గుడ్లు తీసుకుంటుందట.