రష్మికా మందన్న రియల్ స్టోరీ

Rashmika Mandanna Real Story

0
96

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక. ఆమె నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. అందం అభినయంతో పాటు నటనతో కోట్లాది మంది ప్రేక్షకులని సొంతం చేసుకుంది రష్మిక. ఆమె రియల్ స్టోరీ చూద్దాం. రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్పేట్ లో1996 ఏప్రిల్ 5 న జన్మించింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. త‌ర్వాత M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించింది.

రష్మికా బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరెబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2016లో ఆమెకు 24వ స్థానం లభించగా, 2017లో ఆమె మొదటి స్థానం సంపాదించింది. ముందుగా ఆమెకి కిరిక్ పార్టీ సినిమా సమయంలో
నటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. జులై 2017లో వారి నిశ్చితార్థం జరిగింది. తర్వాత పెళ్లి వరకూ వీరు వెళ్లలేదు విడిపోయారు.

ముందుగా 2014 లో రష్మికా మోడలింగ్ ప్రారంభించింది. అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. క్లీన్ & క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ఆ తరువాత ఆమె కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంలో నటించింది. అక్కడ నుంచి ఆమెకి అనేక అవకాశాలు వచ్చాయి.

కిరిక్ పార్టి
అంజని పుత్ర
ఛలో
గీత గోవిందం
దేవదాస్
యజమన
డియర్ కామ్రేడ్
సరిలేరు నీకెవ్వరు
భీష్మ
పొగరు
సుల్తాన్
పుష్ప