Rashmika | పెళ్ళిపై స్పందించిన రష్మిక..!

-

‘పుష్ఫ-2’ మూవీ ఈవెంట్‌ను చెన్నై వేదికగా ‘వైల్డ్ ఫైర్’ నిర్వహించారు మేకర్స్. ఇందులో మూవీ టీమ్ అంతా పాల్గొంది. ఈ వేదికపై నటి రష్మిక(Rashmika) తన పెళ్ళి అంశంపై కూడా స్పందించింది. ఈ వేడుకలో భాగంగా మీరు ‘ఇండస్ట్రీ వ్యక్తిని వివాహమాడతారా.. బయటి వ్యక్తినా’ అని ప్రశ్నించగా ‘ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు’అని సమాధానం ఇచ్చింది. కానీ ఎవరిని అనేది మాత్రం చెప్పలేదు. ఆమె సమాధానం బట్టి చూస్తే ఇప్పటికే ఆమె ఎవరితోనే రిలేషన్‌లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కానీ ఆ అందగాడు ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అతి త్వరలో దీనిపై ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే ఈ వేడుక సందర్భంగా పుష్ప-2 సినిమా గురించి మాట్లాడుతూ.. తన జీవితాన్ని మార్చేసిన సినిమా పుష్ప అంటూ చెప్పింది నేషనల్ క్రష్ రష్మిక.

- Advertisement -

అయితే ఇప్పటికే రష్మిక, రౌడీ హీరో విజయ్ దేవర కొండ(Vijay Devarakonda) రిలేషన్‌లో ఉన్నరంటూ వార్తలు తెగ వస్తున్నాయి. ఇప్పుడు రష్మిక(Rashmika) ఇచ్చిన సమాధానంతో.. ఈ వార్తలు వాస్తవమేనా అన్న అనుమానాలు అధికమవుతున్నాయి. ఒకవేళ వీరిద్దరూ రిలేషన్‌లో ఉంటే ఎప్పుడు పెళ్ళి పీటలెక్కుతారన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సార్లు రష్మిక, విజయ్ పలు చోట్లు కలిసి కనిపించారు. ఇద్దరూ కలిసి వెకేషన్లకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరే పెళ్ళి చేసుకోనున్నారంటూ వస్తున్న వార్తలు మరింత అధికమయ్యాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Read Also: రామ్ గోపాల్ వర్మ అరెస్ట్‌కు అంతా సిద్ధం..!
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...