రష్మిక సీక్రెట్స్ బయటపెట్టిన మాజీ లవర్

రష్మిక సీక్రెట్స్ బయటపెట్టిన మాజీ లవర్

0
91

సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ సౌత్ ఇండియాలో ఎవరు అంటే ఫస్ట్ చెప్పేది రష్మిక మందన్నా, అయితే ఆమెకు వరుస విజయాలు రావడంతో ఆమెకు అవకాశాలు తలుపు తడుతున్నాయి, కెరియర్ స్టార్టింగ్ లో ఆమె లవ్ లో ఉంది అనే వార్తలు వినిపించాయి ..ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంది అని అనుకున్నారు అందరూ.

ఆ మాటలు నిజం చేస్తూ..కిరాక్ పార్టీలో రక్షిత్, రష్మిక కలిసి నటించారు , వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఆతర్వాత ప్రముఖుల మధ్య నిశ్చితార్థం కూడా వైభవంగా జరిగింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఆమె మాజీ ప్రియుడు ఆమె గురించి కొన్ని విషయాలు తెలిపారు.

రష్మికకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అని రక్షిత్ తెలిపారు.. ఆమె గతంలో ఎలా ఉండేదో తనకు తెలుసునని, కాబట్టి ఆ కలలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసన్నాడు. ఆమె కన్న కలలు నిజం కావాలని మాత్రం కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. మొత్తానికి ఆమెపై అతనికి ఎంత ప్రేమ ఉందో మరోసారి ఈ మాటలే రుజువు అంటున్నారు ఇరువురి అభిమానులు.