టాలీవుడ్ లో ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది హీరోయిన్ రష్మిక, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది ఆమె, ఇక బాలీవుడ్ లో కూడా ఆమెకి అవకాశాలు వస్తున్నాయి, ఇక తమిళ్ లో కూడా సినిమాలు చేస్తోంది, ఇక తాజాగా ఆమె ముంబైలో ఓ ఇల్లు తీసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, సొంతంగా ఓ లగ్జరీ హౌస్ ని ముంబైలో ఈ భామ కొనుగోలు చేసిందట. - Advertisement -
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఇటీవల స్టార్ట్ అయింది, ఇక ముంబైలో షూటింగులో పాల్గొంటోంది, ఇక మరో హిందీ సినిమాలో కూడా ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. ఇక ఆమె షూటింగ్ కు వెళ్లిన సమయంలో అక్కడ హోటల్ లో ఉంటున్నారట, దీంతో ఆమె హోటల్ లో ఉండలేక అక్కడ ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది, ఇక ఎలాగో అక్కడ ఉండాలి అని ఆమె డిసైడ్ అయ్యారట. ఇక హైదరాబాద్ ముంబైకి ఈ భామ షూటింగులతో బిజీ బిజీగా తిరుగుతోంది. మొత్తానికి బాలీవుడ్ లో ఆమె కెరీర్ ని ప్లాన్ చేస్తోంది అంటున్నారు.
|
|
|
ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రష్మిక
-