సినీ రంగానికి విశేష సేవలు అందించిన వారికి అత్యంత అత్యున్నత పురస్కారాలు ఇస్తారు అనే విషయం తెలిసిందే అలాంటి దానిలో సినీ రంగంలో అగ్రగణ్యులకు అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, తాజాగా ఈ అవార్డుని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అందుకున్నారు.
ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అమితాబ్ అందుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ ను కోవింద్ అభినందించారు, బిగ్ బీకి అవార్డు రావడంతో అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు, సోషల్ మీడియాలో ఇదే పెద్ద షేర్ అవుతోంది.
, అమితాబ్ ప్రసంగిస్తూ, ఈ అవార్డు అందుకోవడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం, దర్శక నిర్మాతల సహకారం, అభిమానుల ఆదరణ వల్లే తాను ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పారు. దేశ వ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి అమితాబ్ కి.