రస్నాయాడ్ నుంచి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన నటి ? ఎవరంటే

రస్నాయాడ్ నుంచి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన నటి ? ఎవరంటే

0
97

రస్నా బేబీగా పేరొందిన అంకితా ఝవేరీ మన తెలుగువారికే కాదు బుల్లితెరలో ఈ యాడ్ చూసిన వారికి అందరికి ఆ నటి అంకిత పరిచయమే, ఆ యాడ్ ద్వారా ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది.
అంకితా ఝవేరీ 1982, మే 27న జన్మించింది. హీరోయిన్ అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి గుజరాతీ, తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి.

అంకిత ముంబయిలోని హెచ్.ఆర్.కళాశాలలో బీ.కాం పూర్తి చేసింది.. ఆమెకి మూడేళ్ల వయసులో రస్నా వ్యాపార ప్రకటనలో నటించి రస్నాబేబీగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఆమె వీడియోకాన్ ఇలా అనేక వ్యాపార ప్రకటనలలో నటించింది.

ఇక ఆమె తెలుగులోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది అనేది చూస్తే, 2002లో వై.వి.చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కోసం హీరోయిన్ను వెతకడానికి ముంబాయి వెళ్ళినప్పుడు అంకిత ఫోటోలు చూసి, ఆమె రస్నా బేబీ రూపం నచ్చడంతో ఆ సినిమాలో కథానాయకిగా అవకాశం ఇచ్చాడు. ఇక అక్కడ నుంచి ఆమె సినిమాల్లో నటించింది.

తర్వాత ఆమె ప్రేమలో పావనీ కళ్యాణ్ సినిమాలో నటించింది, ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన
సింహాద్రిలో నటించే అవకాశం వచ్చింది. ఇక కొద్ది కాలం మూవీలకి గ్యాప్ ఇచ్చి తర్వాత లండన్ వెళ్ళి అక్కడ సినీ దర్శకత్వంలో డిప్లొమా చేసి తిరిగివచ్చింది. ఇక తర్వాత సినిమా అవకాశాలు లేక ఆమె టాలీవుడ్ కు దూరంగా ఉంది.

ఆమె నటించిన చిత్రాలు చూద్దాం
లాహిరి లాహిరి లాహిరిలో
సింహాద్రి
స్టేట్ రౌడీ
విజయేంద్రవర్మ
సీతారాముడు
అనసూయ
వినాయకుడు