రత్నవేలు ఇంట విషాదం

రత్నవేలు ఇంట విషాదం

0
168

ఏదైనా చిత్రం అందంగా రావాలి అంటే కచ్చితంగా ఆ సినిమా కెమెరా మెన్ గొప్పదనం ఎంతో ఉంటుంది, అలాగే సౌత్ లో టాప్ డీవోపీగా అనేక హిట్ చిత్రాలకు వర్క్ చేసిన వ్యక్తిగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు మంచి పేరు ఉంది, తాజాగా ఆయన ఇంట విషాదం నెలకొంది.

రత్నవేలుకు మాతృవియోగం కలిగింది. రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి కన్నుమూశారు. ఆమె పూర్తిపేరు జ్ఞానేశ్వరి రామన్. ఆమె వయసు 80 సంవత్సరాలు. జ్ఞానేశ్వరి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె మరణించారు అని తెలుస్తోంది, ఆయన ఈ విషయం తెలిసి కన్నీరు మున్నీరు అయ్యారు.

నా కళ్లలోకి చూసి నా ఆశయాలను, ఆకాంక్షలను గ్రహించగల వ్యక్తి మా అమ్మ. ఎప్పుడూ నా వెన్నంటే నిలిచింది. జీవితంలో ఏమేం సాధించాలని అనుకున్నానో అన్నింటినీ సాకారం అయ్యేలా చేసిన అమృతమూర్తి మా అమ్మ. ఇవాళ నేనీ స్థితిలో ఉన్నానంటే అందుకు మా అమ్మే కారణం. నా స్ఫూర్తి, నా శక్తి, నా సంతోషం అన్నీ ఆమే. అమ్మా, నిన్నెంతో మిస్సవుతున్నాను. జీవితకాలం నీకు రుణపడివుంటాను అంటూ ట్వీట్ చేశారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు ఫోన్ చేసి నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.