హీరోయిన్ రవళి గుర్తుందా ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారు రియల్ స్టోరీ

హీరోయిన్ రవళి గుర్తుందా ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారు రియల్ స్టోరీ

0
276

హీరోయిన్ రవళి తెలుగుతెరపై ఎన్నో అద్బుత చిత్రాల్లో ఆమె నటించింది, అంతేకాదు రవళికి తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. ఆమెది మన తెలుగు ప్రాంతం గుడివాడ, . ఆమె ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది, ఇక అక్కడ నుంచి ఆమెకి సినిమా అవకాశాలు వచ్చాయి.

తర్వాత పెళ్లి సందడి సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో రవళిపై చిత్రీకరించిన మా పెరటి … పాట బాగా సూపర్ హిట్ అయింది, ఆమె పేరు శైలజ అయితే తర్వాత రవళిగా మార్చుకుంది.. కొంతకాలానికి ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాలలో నటించింది.

మిథున్ చక్రవర్తి ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్కుమార్ సరసన గడబిడ కృష్ణలో, జగ్గేష్ సరసన వీరన్న, కుబేర సినిమాలలో, సుమన్ సరసన బిల్లా-రంగా సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్, విజయకాంత్ లతో సినిమాలు చేసింది. అంతేకదు మరో పక్క సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా ఆమె నటించింది

ఇక ఆమె వివాహం విషయానికి వస్తే, 2007 మే 9న హైదరాబాదుకు చెందిన వ్యాపారి అయిన నీలకృష్ణను వివాహం చేసుకుంది..2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది…అంతేకాదు రాజకీయాల్లో కూడా ఆమె రావాలి అని భావించి, 2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంది…రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే, వివాహం తర్వాత ఆమె స్టాలిన్ చిత్రంలో నటించింది.