ఆ నటితో తనకున్న ఎఫైర్ ని బయటపెట్టిన రవిబాబు..!!

ఆ నటితో తనకున్న ఎఫైర్ ని బయటపెట్టిన రవిబాబు..!!

0
94

ముందు నటుడిగా పరిచయమై ఆ తర్వాత వినూత్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవిబాబు ప్రస్తుతం ఆవిరి అనే సినిమా కి దర్శకత్వం వహించారు.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రవిబాబు.. నటితో ఎఫైర్ పై స్పందించారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

తనకు అసలు సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవని, ఏ విషయం గురించీ మాట్లాడనని.. తన పేరు మీద ఉన్నవన్నీ ఫేక్ అకౌంట్లు అని తెలిపారు. పదిహేను రోజుల క్రితం తన అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు ఫోన్ చేసి ‘సర్ మీరు ఎవరో అమ్మాయిని శారీరకంగా హింసించారని రెండు వెబ్ సైట్స్ తో మాట్లాడింది’ అని లింక్ పంపించాడు.

ఆ వీడియోలో తను ఫేస్ బుక్ లో ఆమెతో అసభ్యంగా చాట్ చేసినట్లు చూపించారని.. ఎవడో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమెతో చాట్ చేయడం మొదలుపెట్టాడని.. అవన్నీ అందులో చూపించారని అన్నారు. ఆమె ‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్ర చేసిందట. ఆ తరువాత జర్నలిస్ట్ కి ఫోన్ చేసి ‘అది నా ఫేస్ బుక్ అకౌంటో కాదో.. తెలియకుండా ఎలా మాట్లాడతారు’ అని అడిగినట్లు రవిబాబు చెప్పారు. వాస్తవానికి వారిపై కేసు పెట్టాలి. కానీ, వదిలేసినట్టు తెలిపారు.