రావిచెట్టు మొండెం నుంచి కారుతున్న కన్నీరు..

రావిచెట్టు మొండెం నుంచి కారుతున్న కన్నీరు..

0
111

వేప చెట్టు రావి చెట్టు అనగానే ప్రజల్లో ఎనలేని భక్తి పుట్టుకొస్తుంది. దీంతో ప్రజలు ఆ చెట్టుకు పసుపు కుంకుమలతో నిత్య పూజలు చేస్తుంటారు. ప్రజలు ఎంతో భక్తితో పూజించే ఓ రావిచెట్టును కొందరు నరికివేశారు. అయితే మిగిలిన మొండెం నుంచి కన్నీరు కారుతుంది . ఈ ఘటన వరంగల్ జిల్లా లో జరిగింది.

కాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం లోని ఇల్లంద లోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో రావిచెట్టునీ నరికి వేశారు. దీంతో ఆ చెట్టు మొండెం నుంచి కన్నీరు కారుతోంది. విషయం తెలిసిన భక్తులు ఆ చెట్టును ని చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు.ఇదంతా హనుమంతుని మహిమెనని భక్తులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ చెట్టుకు భక్తులు పరమ పవిత్రంగా గా పూజలు చేస్తుంటారు. అటువంటి చెట్టును నరికి వేయడం పై భక్తులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేశారు.