మాస్ రాజ రవితేజ ఇద్దరు హీరోయిన్స్ తో రోమాన్స్

మాస్ రాజ రవితేజ ఇద్దరు హీరోయిన్స్ తో రోమాన్స్

0
108

మాస్ రాజా రవితేజా హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కిలాడి ముచ్చట్లు ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో రోజుకు ఒక వార్త బయటకు వస్తోంది… ఈ చిత్రంలో రవితేజ డ్యుయల్ రోల్ లో చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి… అలాగే రవితేజకు తోడు మరో హీరో కూడా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు…

నిన్నా మొన్నటివరకు ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్దే నటించనుందని వార్తలు వచ్చాయి.. అయితే ప్రస్తుతం వరుస చిత్రాలతో వరుస హిట్లను సొంతం చేసుకున్న ఇప్పుడు చేతి నిండా సినిమాలు పెట్టుకున్న పూజా రవితేజకు ఓకే చెబుతుందో లేదో చూడాలి…

ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఫిలినగర్ లో చక్కర్లు కొడుతోంది… ఈ చిత్రంలో ఒక పాత్రకు నిధి అగర్వాల్, మరో పాత్రకు లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించే అవకాశాలు ఉన్నాయి… మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే…