రవితేజ క్రాక్ సినిమా విడుదల డేట్ వచ్చేసింది

-

మార్చి నుంచి కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగులు నిలిచిపోయాయి, దీంతో సినిమాలు పట్టాలు ఎక్కలేదు, అలాగే సినిమాలు విడుదల జరగలేదు, ఇక చిత్ర సీమ చాలా నష్టాలు చూసింది.. ఓ పక్క కార్మికులు పలు ఇబ్బందులు పడ్డారు, ఈ సమయంలో సినిమా థియేటర్లు ఓపెన్ అయినా సినిమాలు కొన్ని ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు, అయితే అసలు సినిమా థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే భయం కూడా నిర్మాతలకు కలుగుతోంది.

- Advertisement -

మరీ ముఖ్యంగా పెద్ద సినిమా నిర్మాతలు కూడా ఆలోచన చేస్తున్నారు, తాజాగా రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం క్రాక్ విడుదలకు సిద్దం అయింది, తాజాగా ఈ సినిమా ఎప్పుడు వచ్చేది ప్రకటించారు చిత్ర యూనిట్..
2021 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.

ఇక త్వరలో ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు… ఈ విషయం దర్శకుడు గోపీచంద్ మలినేని వెల్లడించారు. వీరి కాంబోలో వచ్చిన డాన్ శీను బలుపు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి, దీంతో ఈసినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...