రవితేజ ఫ్యాన్స్ కు పండగే..“రామారావు ఆన్ డ్యూటీ” టీజర్ రిలీజ్

Ravi Teja fans' festival .. "Rama Rao on Duty" teaser release

0
113

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. యూనిక్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీకి డెబ్యూట్ డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్ , ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మహా శివరాత్రి పండుగ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.

ఇక టీజర్ లో మాస్ మహారాజ్ రవితేజ..యాక్టింగ్ ఇరగదీశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో రవి తేజ డిప్యూటీ కలెక్టర్ గా నటించడం..సినిమాకె హైప్ వచ్చింది. ‘పేరు, రూపం సింపుల్‌గా ఉన్న వాడు సూప‌ర్ మ్యాన్’ అంటూ ర‌వితేజ గురించి చెప్పే డైలాగ్స్ తో టీజ‌ర్ మొద‌లైంది. ఈ టీజర్ చూస్తే.. సినిమా పూర్తిగా ఎనర్జిటిక్ గా ఉండేలా కనిపిస్తోంది.

https://www.youtube.com/watch?v=c4An2J6m5GU