తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిసిందే ..కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఇక సినిమా హిట్ అయితే 10 కోట్ల నుంచి 15 కోట్లకు పెంచుతున్నారు రెమ్యునరేషన్లు.. ఇలా భారీగా సినిమాల బట్టీ, బడ్జెట్ బట్టీ హీరో రేటు పెరుగుతోంది..
సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న రవితేజ ఒకప్పుడు తన తొలి పారితోషికం ఎంత తీసుకున్నాడో తెలుసా… సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఎవరి సాయం లేకుండా చిత్ర సీమలో ఎదిగారు, చిరు తర్వాత అంత ఫేమ్ తెచ్చుకున్నారు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా..
1990ల్లో చిత్ర సీమలోకి వచ్చాడు రవితేజ.. డైరెక్షన్ నుంచి నటన వైపు వచ్చాడు రవితేజ.. నిన్నే పెళ్లాడతా సమయంలో నాగార్జున చేతుల మీదుగా ఈయన తొలి రెమ్యునరేషన్ అందుకున్నాడు.
ఆయనకు 3500 చెక్ ఇచ్చారట నాగార్జున, ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాడు తర్వాత ఆ నగదు అవసరం ఉండి వాడుకున్నాడట.