స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో హీరోగా రవితేజ తనయుడు ఎంట్రీ..ఫుల్ జోష్ లో ఫాన్స్

0
106

మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు తనదైన శైలిలో నటించి సత్తా చాటుకున్నాడు. స్టార్ హీరోగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవలే శ్రీకాంత్ తనయుడు అయినా రోషన్ ను హీరోగా మనకు పరిచయం చేసాడు.

తాజాగా రవితేజ తనయుడు మహాదన్ ను కూడా  అనిల్ రావిపూడి దర్శకత్వం లో  హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన రవితేజ సినిమా ” రాజా ది గ్రేట్” మంచి సక్సస్ సాధించింది. ఈ చిత్రంలో రవితేజ తనయుడు కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

అయితే మహాదన్ ను తో అనిల్ రావిపూడి ఒక యూత్ ఫుల్ స్టోరీని చేయాలనుకుంటున్నాడట. కాలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథలో హీరోగా మహాధన్ అయితే బాగుంటాడని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు రవితేజను సంప్రదించగా దానికి మాస్ మహారాజ్ ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.