రవిబాబు ఆవిరి నుంచి మరో ఆసక్తికర టీజర్..!!

రవిబాబు ఆవిరి నుంచి మరో ఆసక్తికర టీజర్..!!

0
105

వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించడంలో రవి బాబు ముందుంటారు.. నటుడిగా తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించిన రవిబాబు తొలి సినిమాగా అనసూయ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ అందుకున్నారు.. ఆ తర్వాత అమరావతి, లడ్డుబాబు, అవును అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇటీవలే పందిపిల్లతో ఓ సినిమా చేసి మంచి మార్కులు కొట్టేశారు..

ఇకపోతే ఆయన తాజాగా చేస్తున్న చిత్రం ఆవిరి.. కొద్దిరోజుల క్రితం ఆవిరి టీజర్ 1 రిలీజ్ చేశారు. తర్వాత ఆవిరి టీజర్ 2 రిలీజ్ చేశారు. తాజాగా ఆవిరి టీజర్ 3 రిలీజ్ చేశారు.సహజంగా ఒక సినిమాకు మూడు టీజర్లు విడుదల చేశారంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారు? మొదటి టీజర్ లో లేని అంశాలు రెండో టీజర్ లోనూ.. మూడులో ఇంకా విభిన్నంగానూ ఉంటాయని ఆశిస్తారు. కానీ ఈ మూడు టీజర్లలో స్వల్పమైన మార్పులు ఉన్నాయి. అదేంటో తెలుసుకోవాలంటే టీజర్ పై ఓ లుక్ వేసుకోండి..