రవితేజ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్..

రవితేజ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్..

0
105

వరుస ప్లాఫ్ లను తన ఖాతాలో వేసుకుంటున్న హీరో రవితేజ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు రమేష్ శర్మతో చేస్తున్నాడు.. ఈచిత్రానికి ఖిలాడీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాను చేస్తున్న క్రాక్ సినిమా పూర్తయ్యాక ఈ కొత్త చిత్రాన్ని రవితేజ ప్రారభిస్తాడని అంటున్నారు..

ఈ చిత్రంలో రవితేజకు హీరోయిన్గా సీరత్ కపూర్ నటించే అవకాశం ఉందని అంటున్నారు… ఈ ముద్దుగుమ్మ రవితేజ హీరోగా నటించిన టచ్ చేసి చూడు చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఇదే హీరోతోనే మరో ఛాన్స్ కొట్టేసింది…

రన్ రాజా రన్ చిత్రంతో టాలీవుడ్ కు సీరత్ కపూర్ పరిచయం అయింది.. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ టైగర్, కొలంబస్, ఒక్కక్షణం, టచ్ చేసిని చూడు, కృష్ణా అండ్ హిజ్ లీల వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కాగా టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్ము ఇప్పటి వరకు బ్రేక్ పడలేదు…