రవితేజ కొత్త సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా టాలీవుడ్ టాక్

రవితేజ కొత్త సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా టాలీవుడ్ టాక్

0
88

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర సీమలోకి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసి హీరో స్ధాయికి ఎదిగారు మాస్ మహారాజ్ రవితేజ.. ఆయన అంటే అందరికి ప్రత్యేకమైన అభిమానం.. చాలా మంది ఆయనని ఇష్టపడతారు… ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి విమర్శలు వివాదాలు లేని హీరోగా ఆయనకు పేరు ఉంది, ఇక అభిమానుల కోసం ఎంత వరకూ అయినా వెళతారు ఆయన.

 

స్టార్ హీరోలలో రవితేజ దూకుడు మామూలుగా లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే క్రాక్ తో తిరుగులేని హిట్ ను తన సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన రవితేజ సినిమాల్లో ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టింది.

ఖిలాడి సినిమా షూటింగుతో బిజీగా ఉన్న ఆయన, ఆ తరువాత ప్రాజెక్టును త్రినాథరావు నక్కినతో చేయవలసి ఉంది.

 

కాని ఆయన మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు..సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు…శరత్ మండవ స్టోరీ నేరేట్ చేసిన వెంటనే ఈ చిత్రం చేస్తాను అన్నారట రవితేజ, మొత్తానికి ఇది యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుంది అని తెలుస్తోంది..

 

ఈ సినిమాని 30 రోజుల్లో పూర్తి చేయాలనే ఓ కండిషన్ పెట్టారట. ఇందులో ఆయన సరసన దివ్యాన్ష కౌశిక్ నటిస్తోంది. ఇక సుమారు ఆయనకు 8 కోట్ల రెమ్యునరేషన్ వస్తుంది అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.