ఇంత ఘాటుగా ఉందేంటి.. RDX ట్రైలర్ రచ్చ రచ్చ చేస్తుందిగా..!!

ఇంత ఘాటుగా ఉందేంటి.. RDX ట్రైలర్ రచ్చ రచ్చ చేస్తుందిగా..!!

0
95

తొలి సినిమా లోనే అందాల రచ్చ చేసిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు RDX లవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల కాగా ఆ టీజర్ కి మంచి మార్కులు పడ్డాయి.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. గతంలో వచ్చిన టీజర్ లో అడల్ట్ కంటెంట్ మాత్రమే ఉండేలా టీజర్ కట్ చేసిన దర్శకుడు.. ట్రైలర్స్‌లో మాత్రం పూర్తి వేరియేషన్ చూపిస్తున్నాడు.

అసలు టీజర్, ట్రైలర్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా అద్బుతమైన స్ట్రాటజీ చూపించాడు. పాయల్‌ను కేవలం స్కిన్ షో కోసమే ఎంచుకున్నాడేమో అనేంతగా టీజర్ వస్తే.. ట్రైలర్‌లో మాత్రం ఫుల్లుగా సీరియస్ కథ చెప్పాడు. RDX Love సినిమాలో పాయల్ రాజ్‌పుత్ సరసన తేజస్ కంచర్ల నటించాడు. శంకర్ భాను డైరెక్ట్ చేసిన ఈ మూవీని సి.కళ్యాణ్ నిర్మించాడు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది.