రెబల్ స్టార్‌ టూ పాన్ ఇండియా స్టార్‌..ప్రభాస్ సినీ ప్రస్థానం ఇదే..

0
115

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు వింటే చాలు ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. ఆ తర్వాత ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు. అంతేకాదు త్వరలో ఆదిపురుష్‌‌లో శ్రీరాముడిగా కనిపించనున్నాడు. డార్లింగ్ ప్రభాస్ అంటే ఇష్టం లేని వారుండరు. ఎంతో మంది ప్రభాస్ జీవిత చరిత్ర, జీవిత వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటారు. అసలు ప్రభాస్ పూర్తి పేరు ఏంటి? అతని జీవిత వాస్తవాల గురించి ఇప్పుడు చూద్దాం..

ప్రభాస్ పూర్తి పేరు ‘ఉప్పలపాటి ప్రభాస్ రాజు’. శివ కుమారి, సూర్యనారాయణా రాజు ప్రభాస్ తల్లిదండ్రులు. 1979 అక్టోబరు 23 చెన్నైలో జన్మించారు. ప్రభాస్ ఎత్తు వచ్చి 6 అడుగుల 2 అంగుళాలు. అలాగే బరువు 102 కిలోలు ఉంటాడు.

అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రముఖ నటులు గొపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు. 2002లో జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన‘ఈశ్వర్’ మూవీతో తెరంగేట్రం. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్.. ధూల్‌పేట్‌కు చెందిన ఈశ్వర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.  
2004లో వర్షం మూవీతో మొదటి బ్రేక్. ‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా …2004లో చేసిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ సినీకెరీర్‌ను మలుపు తిప్పింది. హీరోగా ప్రభాస్‌కు మూడో సినిమా. ఈ మూవీతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు ‘రాఘవేంద్ర’ అనే మాస్ సినిమాతో పలకరించినా.. ఈ మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయింది.
‘పౌర్ణమి’లో క్లాస్ క్యారెక్టర్, ‘యోగి’లో మదర్ సెంటిమెంట్‌తో కలిపిన యాక్షన్, ‘మున్నా’లో వెరైటీ యాక్షన్, ‘బుజ్జిగాడు’లో ఫుల్ మాస్ క్యారెక్టర్‌తో పాటు కామెడీని పండించాడు. ఆ తరువాత ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటు ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. బాహుబలి చిత్రంతో చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాడు. తాజాగాా ‘సాహో’ తో పలకరించాడు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది.
ఇక బాహుబలితో వచ్చిన ఈ క్రేజ్ వల్లే థాయిలాండ్‌లోని  మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న  ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టారు. దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాదేశ్యామ్ తో మనముందుకొచ్చి అలరించాడు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు అయినటువంటి రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ప్రభాస్ మూడు సినిమాల్లో నటించాడు. బిల్లా, రెబల్, రాధేశ్యామ్ లాంటి మాస్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు.