రీమా సేన్ రియల్ స్టోరీ ఆమె భర్త ఎవరో తెలుసా ఇప్పుడు ఎక్కడుంది

రీమా సేన్ రియల్ స్టోరీ ఆమె భర్త ఎవరో తెలుసా ఇప్పుడు ఎక్కడుంది

0
94

రీమా సేన్ టాలీవుడ్ లో చిత్రం మనసంతా నువ్వే సినిమాలతో కుర్రకారుకి ఫేవరేట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది , అయితే ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ భామ ఎక్కడ ఉంటోంది ఆమె రియల్ స్టోరీ చూద్దాం
రీమా సేన్ 1981 అక్టోబరు 29 న కోల్కతాలో జన్మించింది. ఆమె కోల్కతాలోని కిడర్పూర్లోని సెయింట్ థామస్ గర్ల్స్ స్కూల్లో
చదువుకుంది, తర్వాత ఆమె కుటుంబం ముంబైకి వెళ్లిపోయారు, ముందు ఆమె మోడల్ గా చిత్ర సీమకు వచ్చింది తర్వాత నటిగా మారింది.

ముంబైలో, ఆమె తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. అనేక ప్రకటనలు ప్రచారాలలో నటించింది. తరువాత ఆమె సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆమె ఉదయ్ కిరణ్ తో కలసి తన మొదటి సినిమాను చేసింది..ఇది సూపర్ హిట్ అయింది. తరువాత ఆ జంట మనసంతా నువ్వే సినిమాలో నటించారు.

తర్వాత బెంగాల్, తెలుగు, బోజ్ పూరి, మరాఠి, తెలుగు , తమిళ్, హిందీ,కన్నడ చిత్రాల్లో నటించింది.సినిమాలు చేస్తున్న సమయంలో రీమా సేన్ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ను 2012 లో వివాహం చేసుకుంది. రుద్రవీర్ అనే బాబు ఉన్నాడు ఈ జంటకి.

రీమా సేన్ నటించిన తెలుగు చిత్రాలు చూద్దాం
చిత్రం
మనసంతానువ్వే
బావ నచ్చాడు
సీమ సింహం
అదృష్టం
వీడే
నీతోవస్తా
నీ మనసు నాకు తెలుసు
అంజి
బంగారం
యమగోల మళ్లీ మొదలైంది
ముగ్గురు
యుగానికి ఒక్కడు